ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న అలియాభట్ సాంగ్ షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతుందనే దానిపై ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అలియాభట్ ప్రస్తుతం డార్లింగ్స్ షూటింగ్ కోసం ముంబైలో ఉంది. ట్రిపుల్ ఆర్‌లోని ఓ పాటను రామోజీ ఫిలింసిటీలో షూట్ చేయనుంది జక్కన్న టీం.
విజువల్ ట్రీట్‌గా రాబోతున్న ఈ పాట కోసం అలియాభట్ ఈ నెలలో హైదరాబాద్‌లో ల్యాండ్ కానుందట. మేకర్స్ రూ.3 కోట్లు ఖర్చు పెట్టి..చాలా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ ను వినియోగించి లీడ్ యాక్టర్లు, వందల మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతోపాటు ఎన్టీఆర్, ఒలివియా మధ్య వచ్చే డ్యుయెట్ సాంగ్ ను జక్కన్న ఉక్రెయిన్ లో చిత్రీకరించనున్నట్టు టాక్.
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్, ఒలివియా మొర్రిస్, సముద్రఖని, రే స్టేవెన్ సన్, అలిసన్ డూడీ కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్‌లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!