అవకాడోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, ఎండు మిర్చి: రెండు, జీలకర్ర, ఆవాలు, శనగ పప్పు, మినుప పప్పు: అర టీస్పూన్ చొప్పున, పసుపు: చిటికెడు, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర: కొద్దిగా, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
ముందుగా అవకాడో గుజ్జుతీసి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో అవకాడో గుజ్జు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, మినుప పప్పు, శనగ పప్పు వేసి వేయించి, పైన పసుపు చిలకరించి.. అవకాడో మిశ్రమంలో కలుపుకొంటే అవకాడో చట్నీ రెడీ. అన్నంతోపాటు చపాతీ, ఇడ్లీ వంటి టిఫిన్లకూ ఇది చక్కటి జోడి.
Egg in Onion Ring Recipe | ఆనియన్ ఎగ్ రింగ్స్ తయారీ విధానం