రవితేజ (Ravi Teja) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao). ఈ సినిమాతో సీనియర్ నటి రేణూదేశాయ్ (Renu Desai) కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హేమలత లవణం అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది రేణూ దేశాయ్. తాజాగా మేకర్స్ ఈ పాత్రను పరిచయం చేస్తూ వీడియో (Hemalatha Lavanam video)ను విడుదల చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది.
18 ఏండ్ల తర్వాత బిగ్ స్క్రీన్కు రీ ఎంట్రీ ఇస్తున్న రేణూదేశాయ్‌కు స్వాగతం. అందరూ ఎంతో ఇష్టపడే రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో హేమలత లవణం పాత్రలో కనిపించబోతున్నారు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. టైగర్ నాగేశ్వర్ రావు బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది.
Team #TigerNageswaraRao welcomes #RenuDesai back to the big screens after 18 years ♥️
The much loved actress will be seen as 'Hemalatha Lavanam' ❤️🔥– https://t.co/9M6yula0jS@RaviTeja_offl @AbhishekOfficl @DirVamsee @AnupamPKher pic.twitter.com/DQmwOq38Ks
— Tiger Nageswara Rao (@TNRTheFilm) September 29, 2022
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాతోపాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర, త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ ధమాకా చేస్తున్నాడు. రవితేజ మరోవైపు బాబీ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తోన్న 154వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!