హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యార్థులకు పరీక్షల భయం, మానసిక ఒత్తిడి పోగొట్టేందుకు మొత్తం ఏడు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. పరీక్షల భయం వెంటాడుతున్న విద్యార్థులు ఆయా హెల్ప్లైన్లకు ఫోన్ చేసి, కౌన్సెలింగ్ పొందవచ్చునని సూచించారు.