‘నీలి రంగు చీరలోనా (Neeli Rangu Cheeralona)..చందమామా నీవె జాన.. ఎట్ట నిన్ను అందుకోనే..ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టా అదుముకోనే..’ఈ పాట నా కోసమే రాశారన్నట్టుగా నెట్టింట నీలిరంగు చీరలో దర్శనమిస్తూ.. మెస్మరైజ్ చేస్తోంది ముంబై భామ హెబ్బా పటేల్ (Hebah Patel).
హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా సంప్రదాయ నీలం రంగు చీరకట్టు (Blue saree look)లో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టగా ఉన్న హెబ్బా పటేల్ తాజా ఫొటోలు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. హెబ్బా ఫొటోలకు కామెంట్లు, లైకుల వర్షం కురుస్తుంది.
ఇటీవలే ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో గ్రామీణ యువతిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో మెరిసింది హెబ్బాపటేల్. హెబ్బా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ తెలుగులో ప్రస్తుతం తెలిసినవాళ్లు, గీత సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో వల్లన్, ఆద్య చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
— Hebah P (@ihebahp) October 3, 2022