భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 6 : జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. రాజాపేటలో అత్యధికంగా 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బొమ్మలరామారంలో-4సెంటీమీటర్లు, భూదాన్‌పోచంపల్లి-3, భువనగిరి-2, తుర్కపల్లి-2, ఆలేరు-2, వలిగొండ-2, బీబీనగర్-1, ఆత్మకూర్(ఎం)-1, గుండాల-1సెంటీమీటర్ వర్షం కురిసింది. యాదగిరిగుట్ట, సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.