హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది.