సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రవేశంతో నగరాన్ని తొలకరి పలకరించింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. బాచుపల్లిలో గరిష్టంగా 6.6, కీసరలో 4.9, కాప్రాలో 4.4, అల్వాల్లో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగరంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు.
మరోవైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 1912, 100, విద్యుత్ శాఖ కంట్రోల్ రూం నంబర్లు 7382072104, 7382072106, 7382071574కు కాల్ చేయాలని సూచించారు.