సూర్యాపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉన్నది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది.