హైదరాబాద్ : గులాబ్ తుఫాను ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా బోరున వాన కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. వాహనదారులు, జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, పాతబస్తీ, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వనస్థలీపురం, బీఎన్‌రెడ్డినగర్, తుర్కయాంజల్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్ఐ, రహమత్‌నగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కుండపోత వాన కురుస్తోంది.
గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మణికొండ, ఫిల్మింనగర్, యూసుఫ్‌గూడ, సైదాబాద్, దిల్సుఖ్నగర్, చార్మినార్, రామంతాపూర్, అంబర్‌పేట, మలక్‌పేట, పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే మరికొద్ది గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.