హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. కోఠి, హబ్సీగూడ, నాచారం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలీపురం, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఓయూ, తార్నాక, కాప్రా, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.