హైదరాబాద్ : హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల శాఖ సంస్థ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లిలో, రాంనగర్, కవాడిగూడ, ఇందిరాపార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్‌లో వర్షం కురుస్తోంది.