హైదరాబాద్, మే 24: బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణకు బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొంతమంది చర్మం పొడిబారి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు బయట దొరికే క్రీములు వాడడం కంటే బొప్పాయి పండు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బొప్పాయితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..
బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలోని విటమిన్స్ చర్మాన్ని రక్షిస్తాయి. నాచురల్ గా మీ ముఖం కాంతివంతం అయ్యేలా కాపాడుతాయి. ఈ ప్యాక్ తరచు ఏసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుస్తుంది.
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడుతుంది. అందువల్ల మీరు ఒట్టి బొప్పాయి గుజ్జు మీ ముఖానికి పెట్టుకున్న కూడా చర్మానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని యంగ్ గా ఉంచుతుంది. అంతేకాదు ముడతలు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా మారుతుంది.