హైదరాబాద్,జూన్ 24: శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు పట్టించు కోకపోతే సమస్య తీవ్రతరం అయ్యి ప్రాణాలకే ముప్పు కలిగే ప్రమాదం ఉన్నది. అందుకే డీ హైడ్రేషన్ సమస్య బారీన పడకుండా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. కొంతమందికి మంచినీరు ఎక్కువుగా తాగాలని అనిపించదు. అటువంటివారికోసం జీలకర్ర దివ్యౌషధంలా పనిచేస్తుంది.
అంతేకాదు జీలకర్ర మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఔషధ గుణాలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకశక్తినిపెంచుతాయి. జీలకర్ర డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఒక స్పూన్ జీలకర్రలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచి… ఉదయం ఆ నీటిని వడకట్టి రోజంతా తాగుతూ ఉంటే డీ హైడ్రేషన్ నుంచి బయట పడతారు. అంతేకాదు జీలకర్ర పొడి చేసుకుని రోజూ మజ్జిగలో కలుపుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రావు.