e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?

మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?

మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?

హైదరాబాద్ ,జూన్ 20: మెంతిఆకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మెంతి ఆకులు ఆర్థరైటిస్ నివారణకు ఉపకరిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. మెంతి ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకుంటే, అది శరీరం నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ శుభ్రపరుస్తుంది. ఈ ఆకులో అనేక విటమిన్లు ,పోషక పదార్థాలతో పాటు విటమిన్ ‘కె’ కూడా లభిస్తుంది.

మెంతి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు…

- Advertisement -

-జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన గ్యాస్ట్రిటిస్, మలబద్ధకం,కడుపు నొప్పు లను నివారిస్తుంది.

-మెంతి ఆకులు డయాబెటిస్‌ను అరికడుతుంది.

-మెంతి ఆకుల్లో ఉండే గ్లూకోజ్ జీవక్రియను నిరోధించగలదు. ముఖ్యంగా టైప్2 డయాబెటిస్ నివారణకు సహాయపడుతుంది.

-మెంతి ఆకులు గుండెలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

-మూత్రపిండాల సమస్యల నుంచి రక్షిస్తుంది

-నోటి పూత, బెరిబెరి వ్యాధిలకు ఉపయోగకరమైంది మెంతికూర.

-తల్లి పాలిచ్చే తల్లులు మెంతికూరను తింటే అధికంగా పాలు పడతాయి.

-మెంతి ఆకుల పొడిని ఉపయోగించి తయారుచేసిన హెర్బల్ టీ అధిక జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇంట్లో తయారుచేయగలిగే ఉత్తమ ఔషధం.

-మెంతి ఆకులు మహిళలకు ఎంతో ఆరోగ్య ప్రయాణాలను ఇస్తాయి. కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి.

-మెంతి ఆకు లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.

-రక్తహీనతతో బాధపడేవారికి ఈ ఆకు మంచి ఔషధం.

-ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

-రాత్రి సమయంలో 100 గ్రాముల మెంతి ఆకులను నీటిలో ఉంచి, మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తింటే చాల మంచిది.

-మెంతి ఆకు అజీర్తి , గ్యాస్ట్రిక్ సమస్యలు, వివిధ పేగు సంబంధిత సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?
మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?
మెంతి ఆకులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..?

ట్రెండింగ్‌

Advertisement