హైదరాబాద్ ,జూన్ 2: మునక్కాయల్లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే మునక్కాయలు మాత్రమే కాదు మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకుతో 300 రకాల వ్యాధులు నయమవుతాయి. మునగాకులో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు మునగాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. మహిళలను ఎక్కువుగా బాధించే సమస్య రక్త హీనత. దీనిని పొడి రూపంలో చేసుకుని మహిళలు రోజు 3 నెలల పాటు తీసుకుంటే రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. థైరాయిడ్ ఉన్న వారు కూడా రెగ్యులర్ గా దీనిని తీసుకోవడం మంచిది. అంతేకాదు షుగర్ ఉన్నవారికి ఇది ఒక ఔషధమనే చెప్పాలి.
దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మునగాకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు ఇస్తే ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. మునగాకు తినడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు, బాలింతలకు అవసరం అయ్యే కాల్షియం, విటమిన్స్ బాగా అంది ఆరోగ్యంగా ఉంటారు. కీళ్ల నొప్పులను ఇట్టె తగ్గిస్తుంది.అంతేకాదు మునగాకును ఎండబెట్టి పొడి చేసుకుని రోజు వేడి నీటిలో వేసుకుని సేవిస్తే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. మునగాకులో ఉండే 46 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను, అల్జీమర్స్, అల్సర్, కాలేయ సంభందిత వ్యాధులను అదుపు చేస్తుంది. బ్లాక్ హెడ్స్ తో బాధపడేవారు మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.