భారత స్టార్ ఆటగాళ్లలో అద్భుతమైన ఫామ్ కనబరుస్తూ ఆకట్టుకుంటున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 బ్యాటర్ల ర్యాకింగ్స్లో రెండో స్థానానికి దూసుకురావడమే అతని ప్రతిభకు నిదర్శనం. మహామహులను దాటుకొని వచ్చేసిన సూర్య.. తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే సూర్యపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయానికి సూర్య బ్యాటింగే కారణం. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై చెలరేగి ఆడిన అతను.. మ్యాచ్‌ను సఫారీల చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.
దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కైఫ్.. ‘టాప్ క్లాస్ పేసర్లు, స్పిన్నర్లు.. టర్నింగ్ పిచ్‌లు, సీమింగ్ పిచ్‌లు.. క్లిష్టమైన మ్యాచ్ పరిస్థితులు.. ఇవేవీ సూర్యకు సమస్యలే కావు. ఆరెంజ్ క్యాపులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవకపోవచ్చు కానీ.. అతను మ్యాచ్‌లు గెలుస్తాడు. నాలుగో నెంబర్‌పై కర్చీఫ్ వేసేశాడు. సుదీర్ఘకాలం పాటు అక్కడ నుంచి కదలడు’ అంటూ కితాబిచ్చాడు.
Top class pacers or spinners, turning or seaming pitches, difficult match situation – nothing bothers Surya. He might not win orange cap, MoM but he will win you matches. No.4 pe rumal daal diya Surya ne, he's not moving for a long time. @surya_14kumar pic.twitter.com/hVbPt2oQBp
— Mohammad Kaif (@MohammadKaif) September 29, 2022