e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె నుంచి సినిమా వస్తుంది అంటే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఆయన అభిమానులు వేచి చూస్తూ ఉంటారు. కానీ సాయిపల్లవి కి కొన్ని సినిమాలతోనే అంత ఇమేజ్ వచ్చింది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే వాటి జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే పెరుగుతూ పోతుంది. ఇదిలా ఉంటే మే 9 ఈమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈమె వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

తమిళనాడులోని కోటగిరిలో సాయి పల్లవి జన్మించింది. ఆమె బాల్యం చాలావ‌ర‌కు కోయంబత్తూర్‌లోనే గ‌డిచింది. అయితే తొలి సినిమా మలయాళంలో నటించడంతో ఈమెను చాలా మంది కేరళ అమ్మాయి అనుకుంటారు. అయితే తాను తమిళమ్మాయి అంటూ మళ్లీ మళ్లీ చెప్తూ.. ప్రేక్షకులకు గుర్తు చేస్తూ ఉంటుంది సాయి పల్లవి. ఈమె పేరు వెనక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిజానికి ఆమె పేరు సాయి పల్లవి కాదు.. కేవలం పల్లవి మాత్రమే. అయితే ఈమె పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అక్కడకు ప్రతి సంవత్సరం వెళ్లి సేవ కూడా చేస్తుంటుంది.

సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

హీరోయిన్ అయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేదు. ప్రతి సంవత్సరం సాయిబాబా జయంతి వేడుకలకు అమ్మతో కలిసి వెళ్తుంది సాయి పల్లవి. బాబా భక్తురాలు కావడంతో పల్లవికి ముందు సాయి చేరింది. అలా ఆమె పేరు సాయి పల్లవి అయిపోయింది. సినిమాలే కాదు చదువులోనూ ఈమె టాప‌రే. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. రేపు ఎప్పుడైనా అవకాశాలు రాకపోతే హాయిగా వెళ్లి డాక్టర్ గా సెటిలైపోతాను అంటుంది. అంతేకానీ అసభ్యంగా ఉండే పాత్రలో మాత్రం నటించనంటుంది ఈమె. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమాల్లో నటిస్తోంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

గ్యాంగ్ లీడ‌ర్‌గా ముందు ఎవ‌రిని అనుకున్నారో తెలుసా?

అనీల్ రావిపూడి ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ..!

క్యాలీ ఫ్ల‌వ‌ర్ టైటిల్‌తో వ‌స్తున్న సంపూ.. టీజర్ అదుర్స్

త్వ‌ర‌గా కోలుకోవాల‌ని బన్నీకు స్వీట్ మెసేజ్ పంపిన చ‌ర‌ణ్ దంప‌తులు

లైగ‌ర్ టీజ‌ర్ వాయిదా వేసిన నిర్మాత‌లు

పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్

సాయి ప‌ల్ల‌వి ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల‌

మహానటి సినిమాకు మూడేళ్లు

బిగ్ బాస్ 5 ఈ సారి ఉండేది కష్టమే అంట..!

మే 9 మోస్ట్ స్పెషల్ ఫర్ టాలీవుడ్ .. ఎందుకో తెలుసా..?

అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాయిపల్లవి పేరులో సాయి ఎలా వచ్చింది.. ?

ట్రెండింగ్‌

Advertisement