e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Huzurabad | ఈ ఏడాది యాభై వేల మందికి ప్రమోషన్లు: హరీశ్ రావు

Huzurabad | ఈ ఏడాది యాభై వేల మందికి ప్రమోషన్లు: హరీశ్ రావు

హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం లో బిజెపి 7.5 శాతం పిఆర్సి ఇస్తే తెలంగాణ రాష్ట్రం 30 శాతం ఇచ్చింది.ప్రభుత్వం తో పాటు ఉద్యోగులు కూడా పని చేస్తే మనం అనుకున్న స్థాయిలో పనులు జరుగుతాయి.పంచాయతీ సెక్రటరీల పనుల వల్ల పల్లెలు అధ్బుతంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్య పద్దతుల్లో ఉద్యోగులు నిరసన తెలిపి తెలంగాణ రాష్ట్రం సాధనలో ఉద్యోగులు అద్భుత పాత్ర పోషించారని” అన్నారు.

- Advertisement -

“జిల్లాలు కావాలని చాలా ఏండ్ల నుంచి పోరాటం చేసినం, తెలంగాణ వచ్చాక 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, ఈ సంవత్సరం లో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చినం,దళిత బంధు పథకం కోసం అందరూ అధ్బుతం గా పని చేస్తున్నారని “హరీశ్ రావు అన్నారు.”తెలంగాణ రాష్ట్రం పనుల్లో, వేతనాల్లో ముందు ఉంది. కరోనా వల్ల రాష్ట్రంలో పిఅర్సి ఆలస్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులకు కోత పెడుతుంది. కరోనా వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం జరిగింది. గతంలో తెలంగాణలో మెడికల్ కాలేజ్ లు లేవు. గతం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నీ కాలేజ్ ల కోసం నిలదీస్తే అప్పుడు ఉన్న తెలంగాణ మంత్రులు తల దించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

“తెలంగాణ వచ్చాక అన్ని కులాలకు రెసిడెన్షియల్ కాలేజీలు ప్రారంభించినం. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా తెలంగాణలో అమలు చేసినటువంటి పథకాలు ఉన్నాయా..?
ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో ప్రభుత్వఉద్యోగులకు అతితక్కువ జీతాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతోపాటుకాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. రాష్ట్రంలో ఖాళీలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.”సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఆలోచన లో సీఎం కేసిఆర్ ఉన్నారు. జోన్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఉద్యోగుల నాయకులతో మాట్లాడమని సీఎం కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ప్రభుత్వమని,పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగులందరి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హరీశ్ రావు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana