e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News గుడ్ న్యూస్ చెప్పిన భ‌జ్జీ.. ఫ్యాన్స్ ఖుష్‌

గుడ్ న్యూస్ చెప్పిన భ‌జ్జీ.. ఫ్యాన్స్ ఖుష్‌

గుడ్ న్యూస్ చెప్పిన భ‌జ్జీ.. ఫ్యాన్స్ ఖుష్‌

టీమిండియా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భ‌స్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2016లో ఈ దంప‌తుల‌కు అమ్మాయి జ‌న్మించ‌గా, ఇప్పుడు జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. హ‌ర్భ‌జ‌న్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా  తాను అక్క‌ను కాబోతున్న‌ట్టు ప్ల‌క్కార్డ్ ప‌ట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హ‌ర్భ‌జ‌న్ సింగ్ త్వ‌ర‌లో ఐపీఎల్‌లో సంద‌డి చేయ‌నున్నాడు. కేకేఆర్ టీం త‌ర‌పున ఆయ‌న బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు కోలీవుడ్‌లో ‘ఫ్రెండ్‌షిప్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక హ‌ర్బ‌జ‌న్ భార్య   గీతా భ‌స్రా బాలీవుడ్‌లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’, ‘సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్’ వంటి సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుడ్ న్యూస్ చెప్పిన భ‌జ్జీ.. ఫ్యాన్స్ ఖుష్‌

ట్రెండింగ్‌

Advertisement