అమరావతి : టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందని , ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు.
కేటీఆర్కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.