దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ హన్సిక. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉన్న హన్సిక కోలీవుడ్‌లో మాత్రం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హన్సిక తాజాగా తన సోదరుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీకి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న జైపూర్‌లో వివాహం జరగగా, ఈ వేడుకకు కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
తన అన్న పెళ్లిలో ట్రెండీ లుక్‌తో కనిపించిన హన్సిక తెగ సందడి చేసింది. వదిన నాన్సీతో బలమైన బంధం ఏర్పడిందని, ఈ వివాహం తర్వాత మేము సోదరీమణులం అయ్యామని పేర్కొంది. మార్చి 21న మొదలైన సంబరాలు పెళ్లితో ముగిసాయి.హన్సిక ప్రస్తుతం మహా అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా హన్సిక సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రంగా అవుతుందని అంటున్నారు.