e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఏజెన్సీ ఇప్పిస్తామంటూ మోసం

ఏజెన్సీ ఇప్పిస్తామంటూ మోసం

ఏజెన్సీ ఇప్పిస్తామంటూ మోసం
  • హల్దిరామ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అంటూ రూ. 21.6 లక్షలు వసూలు
  • బిహార్‌కు చెందిన సైబర్‌నేరగాడు అరెస్ట్‌

హల్దిరామ్‌ ఏజెన్సీని ఇప్పిస్తామంటూ నమ్మించి నగరవాసికి రూ. 21.6 లక్షలు మోసం చేసిన బిహార్‌కు చెందిన సైబర్‌నేరగాడిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో శాలిబండకు చెందిన బాధితుడు హల్దిరామ్‌ ఏజెన్సీ కోసం ఆన్‌లైన్‌లో వివరాల కోసం వెతికాడు. ఈ క్రమంలో హల్దిరామ్‌ మేనేజర్‌ అశీష్‌కుమార్‌ను అంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. మేం హల్దిరామ్‌ ఫుడ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి మాట్లాడుతున్నాం.. డిస్ట్రిబ్యూషన్‌కు రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయాలంటూ సూచించారు. తాను డిపాజిట్‌ చేయలేనంటూ బాధితుడు చెప్పగా.. అలాగైతే మా బాస్‌తో మాట్లాడంటూ రవికుమార్‌ అనే వ్యక్తి పేరుతో మాట్లాడించారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలంటూ సూచిస్తూ రూ. 25 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు, సెక్యూరిటీ పేమెంట్‌, అగ్రిమెంట్‌ ఫీ, స్టాక్‌కు సంబంధించిన అడ్వాన్స్‌ డిపాజిట్‌ అంటూ రూ. 21.60 లక్షలు వసూ లు చేసి మోసం చేశారు. బాధితుడు ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు కేసు  దర్యాప్తు చేపట్టారు. 

హల్దిరామ్‌ పేరుతో వెబ్‌సైట్‌

బిహార్‌, షెఖాపురా జిల్లా నర్సత్‌పురా గ్రామానికి చెందిన రాహుల్‌ కుమార్‌… వికాస్‌, సందీప్‌కుమార్‌, సోనుకుమార్‌తో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పా టు చేశాడు. హల్దిరామ్‌ పేరుతో పాటు పేరున్న కం పెనీల పేరుతో వెబ్‌సైట్లు తయా రు చేసి.. వాటి డీలర్‌ షిప్స్‌ ఇప్పిస్తామంటూ ఆ వెబ్‌సైట్ల ద్వారా అమాయకులకు వల వేస్తుంటారు. హల్దిరామ్‌, ఎస్‌బీఐ కస్టమర్‌ పాయింట్స్‌.. ఇలా పలు రకాలైన ఏజెన్సీలను ఇప్పిస్తామంటూ నమ్మిస్తారు. ఈ క్రమంలో వీళ్ల వెబ్‌సైట్లలోని ఇన్ఫో<\@>హల్దిరామ్‌డీల్‌.కామ్‌కు బాధితుడు మెసేజ్‌ ఇవ్వడంతో  ఈ గ్యాంగ్‌ అతడిని ట్రాప్‌ చేసింది. ఏజెన్సీ ఇప్పిస్తున్నామంటూ నమ్మించి.. దఫ దఫాలుగా డబ్బులు వసూలు చేసింది. మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌ చేయించి, వచ్చిన సొమ్మును అందరూ పంచుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన రాహుల్‌ కుమార్‌ను బీహార్‌లో అరెస్ట్‌ చేసి నగరానికి తరలించారు.    

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏజెన్సీ ఇప్పిస్తామంటూ మోసం

ట్రెండింగ్‌

Advertisement