e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News ర్యాన్‌సమ్‌వేర్‌తో రైతులకు మద్దతుగా నిలిచిన హ్యాకర్స్‌

ర్యాన్‌సమ్‌వేర్‌తో రైతులకు మద్దతుగా నిలిచిన హ్యాకర్స్‌

న్యూఢిల్లీ : కంప్యూటర్‌ హ్యాకర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఇందుకోసం సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేక శైలిని ఎంచుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. కొత్త ర్యాన్‌సమ్‌వేర్‌ను రూపొందించుకున్న సైబర్ నేరస్థులు దేశంలోని పలు కంప్యూటర్లపై సరికొత్త దాడిని ప్రారంభించారు. వీరు ఈ మాల్‌వేర్‌ ఆధారంగా సాధారణంగా సంస్థలు, వ్యక్తులను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తుంటారు. అయితే, ఇక్కడ మాత్రం కేంద్ర కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బాసటగా నిలవండి అంటూ వారు కోరుతుండటం విశేషం. సైబర్‌ నేరస్థులు ఈ విధంగా రైతు సమాజానికి సేవ చేస్తుండటం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్శించారు.
వివిధ సంస్థల్లోని కంప్యూటర్లు బుధవారం ర్యాన్‌సమ్‌వేర్‌కు గురైనట్లు గుర్తించారు. రైతుల నిరసనలతో అనుసంధానమై ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరస్థులు ఈ మాల్‌వేర్‌కు రూపకల్పన చేశారు. వంద రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలువాలని హ్యాకర్స్‌ ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖల్సా సైబర్‌ ఫౌజ్‌ అనే హ్యాకర్‌.. దేశంలో సమూహ దాడికి నాయకత్వం వహించినట్లు సైబర్‌ నిపుణుల నివేదికలు వెల్లడించాయి. రైతుల డిమాండ్లు తీరే వరకు డాటా తిరిగి రాదు అనే సందేశాన్ని ఈ మాల్‌వేర్‌ ద్వారా ఆయా సంస్థలకు తెలియజేశారు. ఇది ‘సర్బ్లోహ్’ అని పిలుచుకునే మాల్‌వేర్‌ను క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ కనుగొన్నది. ఇది హానికరమైన వర్డ్‌ డాక్యుమెంట్ల ద్వారా, ఈ-మెయిళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నారు. రైతులకు మద్దతు ఇచ్చే రాజకీయ సందేశాన్ని కలిగి ఉన్నదని, తాజా ‘సర్బ్లోహ్‌’ ర్యాన్‌సమ్‌వేర్‌.. వారి పెరుగుతున్న దాడి సామర్థ్యాలకు నిదర్శనం అని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ డైరెక్టర్ హిమాన్షు దూబే అన్నారు.

ఆశ్చర్యకరంగా, ఈ కొత్త దాడి టెక్నిక్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నవారు ర్యాన్‌సమ్‌ అడగకుండానే వారి ఫైళ్ళను ఎన్‌క్రిప్టింగ్‌ ద్వారా వినియోగదారుల పరికరాలకు సోకుతున్నారు. ‘ఖల్సా సైబర్ ఫౌజ్’ సిస్టం ఫైళ్ళలో మిలిటరీ-గ్రేడ్ ఎన్క్రిప్షన్‌ను పనికిరానిదిగా ఉపయోగిస్తున్నదని కంపెనీ పేర్కొన్నది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనను తీవ్రతరం చేయడమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై కూడా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఉద్యమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఈ-మెయిల్‌లు, సందేశాల నుంచి వచ్చే అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని క్విక్‌ హీల్‌ సెక్యూరీటీ ల్యాబ్స్‌ వినియోగదారులకు సూచించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana