RCB vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా(Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది.
గత మ్యాచ్‌లో గుజరాత్ జట్టను బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ కూడా యూపీ వారియర్స్‌పై విజయం సాధించి టోర్నమెంట్లో బోణీ కొట్టింది. అయితే.. తొలి రౌండ్లో మంధాన సేన గుజరాత్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి.. ఈసారి ఇరుజట్లలో ఎవరిది పై చేయి కానుంది? అనేది చూడాలి.
గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, సబ్బినేని మేఘన.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ డెవినే, హీథర్ నైట్, కనికా ఆహుజా, ఎలిసే పెర్రీ, శ్రేయాంక పాటిల్, అషా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షట్, దిశా కసాత్.