e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఐటీ కారిడార్‌లో ఓటరు వికాసం

ఐటీ కారిడార్‌లో ఓటరు వికాసం

ఐటీ కారిడార్‌లో ఓటరు వికాసం
  • పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటిన ఐటీ ఉద్యోగులు  
  • బారులు తీరిన పోలింగ్‌ కేంద్రాలు
  • కొత్త అనుభూతిని ఇచ్చిన జంబో బ్యాలెట్‌ పత్రం 
  • పోలింగ్‌ కేంద్రాలకు పిల్లలతో పాటు ఓటర్లు

సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఐటీ కారిడార్‌లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు ఓటింగ్‌లో పాల్గొనరనే ముద్రను చెరిపివేస్తూ ఈసారి మెజారిటీ పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  దీంతో, ఈసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పోలింగ్‌ శాతం గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. ప్రధానంగా కరోనా నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం పని చేస్తున్నారు. అదే విధం గా వరుసగా సెలవులున్నా కరోనా పూర్తిగా బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఐటీ కారిడార్‌లో నివా సం ఉంటున్న ఐటీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద యం పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓట ర్లు లైన్లలో బారులు తీరారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వర కు పట్టభద్రులు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు చిన్న పిల్లలతో వచ్చి క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేశారు. 

బారులు తీరిన ఓటర్లు..

పోలింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి బారులు తీరారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, పటాన్‌చెరువుల పరిధిలోని పోలింగ్‌ బూత్‌లలో ఈసారి ఓటింగ్‌ శాతం గతం కంటే అధికంగా పెరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 40 శాతం లోపే ఓటింగ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగినా, ఎన్నికల్లో మాత్రం విద్యావంతులు చైతన్యంతో ప్రత్యేకంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

జంబో బ్యాలెట్‌.. కొత్త అనుభూతి

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఒకేసారి 93 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో జంబో బ్యాలెట్‌ పత్రాన్ని తయారు చేయించారు. దీంతో ఓటింగ్‌లో పాల్గొని జంబో బ్యాలెట్‌ పత్రంపై ఓటు వేయడం కొత్త అనుభూతికిలోను చేసిందని పలువురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు ఎప్పుడూ తక్కువ మంది అభ్యర్థులతో కూడిన బ్యాలెట్‌ పత్రం చూశాను. ఇప్పుడు మాత్రం దాదాపు 93 మందిలో ఎవరికి ప్రాధాన్యత ఓటు వేయాలో వెతుక్కోవాల్సి వచ్చిందని, దీనికి కొంత సమయం కూడా కేటాయించాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని ఓటర్లు వ్యక్తం చేశారు. ఓటేసేందుకు చాలా మంది పోలింగ్‌ కేంద్రాలకు రావడంతో నాలుగు గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రాలలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అనుమతి నిచ్చారు. కాగా, ఈసారి ఐటీ కారిడార్‌లో ఉన్న పట్టభద్రుల్లో చాలా మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐటీ కారిడార్‌లో ఓటరు వికాసం

ట్రెండింగ్‌

Advertisement