హుజూరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం ఆయన ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో మోటపోతుల రేణుక, తోడేటి కొమురమ్మ, భోగంపాడు గ్రామంలో నర్ర సులోచనకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.