శంకర్జాదవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గోర్మాటి’. రేఖ్యనాయక్ నిర్మాత. అదిరే అభి, కరిష్మా, సిరిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను గేయరచయిత చంద్రబోస్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘బంజారాలు అందరూ చూడాల్సిన సినిమా ఇది’ అని తెలిపారు. బంజారాల సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని చాటిచెబుతూ తెరకెక్కుతున్న చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు.