e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News బంగారంపై మోజు పెరుగుతుంటే ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్.. ఎందుకంటే?!

బంగారంపై మోజు పెరుగుతుంటే ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్.. ఎందుకంటే?!

బంగారంపై మోజు పెరుగుతుంటే ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్.. ఎందుకంటే?!

న్యూఢిల్లీ: బ‌ంగారు ఆభ‌ర‌ణాలు అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్టం.. ఇప్పుడు ఆభ‌ర‌ణాలు, బంగారం కొనుగోలు చేయ‌డానికి స‌రైన టైం అని బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు దాదాపు ఏడాది క్రితం స్థాయికి ప‌డిపోయాయి. శుక్ర‌వారం బులియ‌న్ మార్కెట్‌లో తులం బంగారం (ఫ్యూచ‌ర్స్‌) రూ.44,217ల‌కు ప‌డిపోయింది. గ‌తేడాది ఏప్రిల్ ఏడో తేదీ నుంచి అత్యంత క‌నిష్ఠం.

ఢిల్లీలో శ‌నివారం 22 క్యార‌ట్ల బంగారం వ‌న్ గ్రామ్ రూ.4,390 నుంచి రూ.4,343కి ప‌డిపోయింది. తులం బంగారం ధ‌ర రూ.43,950 నుంచి రూ.43,600ల‌కు ప‌త‌న‌మైంది. ఇది 10 నెల‌లకు పైగా త‌క్కువ ధ‌ర‌. ఇక ముంబైలో తులం బంగారం రూ.43,430ల‌కే ల‌భిస్తున్న‌ది. ఏడాది క్రితం స్థాయికి ధ‌ర ప‌డిపోవ‌డంతో భార‌త్‌లో రిటైల్ క‌స్ట‌మ‌ర్లు బంగారం కొనుగోళ్ల కోసం షాపుల‌కు బారులు తీరారు.

శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర రెండు శాతం త‌గ్గి 1693.79 డాల‌ర్ల‌కు ప‌డిపోయాయి. ఈ వారంలో బంగారం రెండు శాతానికి పైగా ప‌త‌నం కాగా, ఔన్స్ వెండి ధ‌ర 0.2 శాతం పెరిగి 25.35 డాల‌ర్ల‌కు చేరినా తిరిగి ఐదు శాతం డౌన్‌ట్రెండ్‌గా నిలుస్తున్న‌ది. సంక్షోభం త‌లెత్తిన‌ప్పుడ‌ల్లా ఆల్ట‌ర్నేటివ్ పెట్టుబ‌డి మార్గంగా ఉన్న బంగారం ధ‌ర ఒత్తిళ్ల‌కు గుర‌వుతుంటుంది. డిమాండ్‌ను మించి గోల్డ్ మైన‌ర్లు బంగారాన్ని ఉత్ప‌త్తి చేసినా దాని ధ‌ర త‌గ్గుతుంది. అమెరికా డాల‌ర్ బ‌లోపేత‌మైనా బంగారం విలువ త‌గ్గుతూ ఉంటుంది.

క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన బాండ్ల‌కు పెట్టుబ‌డి దారుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. అధిక లాభాలు గ‌డించేందుకు అమెరికా ప్ర‌భుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట‌ర్లు డాల‌ర్లు కుమ్మ‌రించారు. ఫ‌లితంగా ఆక‌ర్ష‌ణీయ పెట్టుబ‌డి మార్గంగా ఉన్న బంగారం గురించి ప‌ట్టించుకునే వారే లేరు.

క‌రోనాతో గ‌తేడాది ఏప్రిల్ నుంచి వివిధ పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో కూరుకుపోతే.. పెట్టుబ‌డిదారులు త‌మ వ‌ద్ద ఉన్న నిధుల‌ను బంగారంవైపు మ‌ళ్లించారు. ఫ‌లితంగా దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స‌గ‌టు పౌరుల‌కు చుక్కలు చూపించాయి.

గ‌త ఆగ‌స్టులో రూ.56,310 ల గ‌రిష్ఠ ధ‌ర ప‌లికిన ప‌సిడి.. తాజాగా శుక్ర‌వారం రూ.43 వేల వ‌ద్ద‌కు ప‌డిపోయింది. ఇదిలా ఉంటే, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌లు, డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ‌పై కూడా భార‌త్‌లో బంగారం కొనుగోళ్ల‌కు డిమాండ్ ఉంటుంది.

గ‌త కొన్ని రోజులుగా 73 రూపాయిల‌కు దిగువ‌న డాల‌ర్ మార‌కం విలువ కొన‌సాగుతుండ‌గా.. శుక్ర‌వారం 73.03 రూపాయిల వ‌ద్ద ట్రేడ్ అయింది. మ‌రోవైపు అమెరికాలో బాండ్ల కొనుగోళ్లు పెరిగినా కొద్దీ.. ఔన్స్ బంగారం ధ‌ర 1500 డాల‌ర్ల స్థాయికి ప‌డిపోతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగారంపై మోజు పెరుగుతుంటే ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్.. ఎందుకంటే?!

ట్రెండింగ్‌

Advertisement