e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home News చాడ్విక్ బోస్మాన్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

చాడ్విక్ బోస్మాన్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

చాడ్విక్ బోస్మాన్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

హాలీవుడ్‌కు చెందిన ప్రసిద్ధ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల 78 వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వర్చువల్‌గా అందజేశారు. మోషన్ పిక్చర్ డ్రామా విభాగంలో ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రానికి దివంగత చాడ్విక్ బోస్మాన్ ఉత్తమ నటుడు అవార్డును గెల్చుకున్నాడు. టీవీ నాటక విభాగంలో ‘ది క్రౌన్’ ఉత్తమ సిరీస్‌గా ఎంపికైంది. ఈ సిరస్‌ ఉత్తమ టీవీ నటి, ఉత్తమ టీవీ నటుడు, ఉత్తమ టీవీ సహాయ నటి అవార్డులను కూడా సొంతం చేసుకున్నది.

గోల్డెన్‌ గ్లోబ్‌ విజేతలు వీరే..

ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ (ఫారిన్‌ లాంగ్వేజీ) విభాగంలో మినారి (అమెరికా), ఉత్తమ టీవీ సిరీస్‌గా షిట్స్‌ క్రీక్‌, ఉత్తమ టీవీ సిరీస్‌గా ది క్రౌన్‌, ఉత్తమ టీవీ సిరీస్‌ నటుడిగా జోష్‌ ఓ కానర్‌ (ది క్రౌన్‌), ఉత్తమ టీవీ సిరీస్‌ సహాయ నటిగా గిల్లన్‌ అండర్సన్‌ ( ది క్రౌన్‌), ఉత్తమ టీవీ సిరీస్‌ నటిగా క్యాథరైన్ ఓ హరా (షిట్స్‌ క్రీక్‌), ఉత్తమ టీవీ సిరీస్‌ నటుడిగా జాసన్‌ సూడేకిస్‌ (టెడ్‌ లాస్సో), మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రోసామండ్‌ పైక్‌ (ఐ కేర్‌ ఏలాట్‌), ఉత్తమ మోషన్‌ పిక్చర్‌గా నోమడ్‌ల్యాండ్‌, ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ దర్శకుడిగా చోలే ఝో (నోమడ్‌ల్యాండ్‌), ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ నటుడిగా సాచా బరోన్‌ కొహెన్‌ (బోరాట్ సబ్క్వాంట్), ఉత్తమ నటుడు మోషన్‌ పిక్చర్‌ డ్రామా విభాగంలో చాడ్విక్‌ బోస్మాన్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌), ఉత్తమ నటి మోషన్‌ పిక్చర్‌ డ్రామా విభాగంలో ఆండ్రా డే (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బిల్లి హాలిడే), ఉత్తమ మోషన్‌ పిక్చర్‌గా బోరాట్‌ సబ్క్వాంట్‌, ఉత్తమ సహాయ నటిగా మోషన్‌ పిక్చర్‌ విభాగంలో జోడి ఫోస్టర్‌ (ది మారిషన్‌), ఉత్తమ లిమిటెడ్‌ సిరీస్‌, ఆంథోలజీ సిరీస్‌గా ది క్వీన్స్‌ గాంబిట్‌, లిమిటెడ్‌ సిరీస్‌, ఆంథోలజీ సిరీస్‌ ఉత్తమ నటుడిగా మార్క్‌ రెఫెల్లో ( ఐ నో దిస్‌ ఈజ్‌ ట్రు), ఉత్తమ నటిగా అన్య టైలర్‌ జోయ్‌ (ది క్వీన్స్‌ గాంబిట్‌), ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ యానిమేటెడ్‌గా సోల్‌, టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయనటిగా జాన్‌ విల్‌ సో (స్మాల్‌ ఎక్స్, మోషన్‌ పిక్చర్‌ ఉత్తమ సహాయనటుడిగా డానియల్‌ కాలుయా (జుడాస్‌ అండ్ ది బ్లాక్‌ మెసియా), రెసిపి ఆఫ్‌ ది ఇయర్‌గా నార్మాన్‌ లీయర్‌, సెసిల్‌ బీడీ ఎమిల్లే అవార్డును జోన్‌ ఫోండా, మోషన్‌ పిక్చర్స్‌ ఉత్తమ స్క్రీన్‌ప్లేగా ఆరోన్‌ సోర్కిన్‌ (ది ట్రయల్‌ ఆఫ్‌ చికాగో 7), మోషన్‌ పిక్చర్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా సియాన్‌, మోషన్‌ పిక్చర్‌ ఉత్తమ సౌండ్‌ స్కోర్‌గా సోల్‌ చిత్రానికి గాను ట్రెంట్‌ రెనార్‌, ఆటికస్‌ రోస్‌, జాన్‌ బాటిస్టేలు గెలుచుకున్నారు.

Advertisement
చాడ్విక్ బోస్మాన్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement