e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News రంగనాయకసాగర్‌కు గోదారమ్మ పరుగులు

రంగనాయకసాగర్‌కు గోదారమ్మ పరుగులు


నాలుగో మోటర్‌ ద్వారా ఎత్తిపోత ప్రారంభం
కుడి, ఎడమ కాలువలకు నీటి తరలింపు
ఎస్సారార్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి..


చిన్నకోడూరు/ఇల్లంతకుంట, మార్చి 22: రంగనాయకసాగర్‌కు మరోసారి గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ పంప్‌హౌస్‌లోని నాలుగో మోటర్‌ను ఇరిగేషన్‌ అధికారులు సోమవారం ఆన్‌చేశారు. నాలుగు రోజులపాటు మోటర్‌ను నిర్విరామంగా నడిపించి టీఎంసీ నీటిని రిజర్వాయర్‌లోకి తరలించనున్నారు. ఎడమ కాలువ ద్వారా 350 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కు ల నీటి విడుదల యథావిధిగా కొనసాగుతున్నది. ఈ కాలువల ద్వారా ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలోని 125 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను నింపారు. ఎగువన రాజన్నసిరిసిల్ల జిల్లాలో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తున్నారు. ఎస్సారార్‌ నుంచి తిప్పాపూర్‌లోని సర్జ్‌పూల్‌లోకి వచ్చిన జలాలను ఇక్కడి పంప్‌హౌస్‌లోని ఒక మోటర్‌ ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
రంగనాయకసాగర్‌కు గోదారమ్మ పరుగులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement