e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి

ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి

ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి

ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి
హైదరాబాద్‌ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో..
నవ్యాంధ్ర సాహితీమూర్తి, భావ కవితా పితామహుడు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు జయంతి సందర్భంగా శనివారం రాయప్రోలు సాహిత్య సౌందర్య దర్శనం కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. అంతర్జాల వేదికపై జరిగిన ఈ సాహితీవేడుకలో, 15 దేశాల నుంచి 45 మంది అతిథులు పాల్గొని రాయప్రోలు వారి వివిధ రచనలపై విశ్లేషణాత్మక ప్రసంగాలను అందించి వీక్షకులకు వీనులవిందు చేశారు.
వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించగా రాధికా మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా ఎనిమిదిన్నర గంటల పాటు కొనసాగింది.

స్వర్గీయ రాయప్రోలు సుబ్బారావు కుమారులురాయప్రోలు ప్రభాకర్, కుటుంబ సభ్యులు, రాయప్రోలు వారి చిత్రపటం ముందు నివాళులర్పిస్తూ జ్యోతిప్రకాశనం గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ సహనిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ తరఫున సభకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా భారత్ నుంచి నందిని సిధారెడ్డి, డా. మండలి బుద్ధప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్, డా. వోలేటి పార్వతీశం, సినీ రచయిత భువనచంద్ర, డా. కె యాదగిరి, డా. లావణ్య సరస్వతి, డా. కసిరెడ్డి వెంకట్ రెడ్డి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఆచార్య కాత్యాయని విద్మహే, సినీనటి జామునా రమణారావు, డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ అతిథులుగా డా.యల్లాప్రగడ రామకృష్ణారావు, ఆస్ట్రేలియా, జయ పీసపాటి హాంగ్ కాంగ్, డా.వెంకట ప్రతాప్, సత్య మల్లెల, మలేషియా, డా. జొన్నలగెడ్డ మూర్తి, యునైటెడ్ కింగ్డమ్, ఆచార్య డేనియల్ నేజెర్స్, ఫ్రాన్స్, సీతారామరాజు, సౌతాఫ్రికా, సంజీవ నరసింహ అప్పుడు, నరేన్ స్వామి సన్యాసి, మారిషస్,చింతగుంట ఉదయపద్మ, యూఏఈ, తాతాజీ ఉసిరికల, డా.వెంకట మాధవి లలిత, కాళిబాబు గంటి, ఖతార్, డా.బూరుగుపల్లి వ్యాస కృష్ణ, ఉగాండా, వీర నరసింహ రాజు, కువైట్, డా. శారదాపూర్ణ శొంటి, రత్నకుమార్ (రత్నపాప) రేవతి అదితం, రాయసం వెంకటరామయ్య,
డా. ప్రసాద్ తోటకూర, డా. వంగూరు చిట్టెంరాజు, అమెరికా, నుంచి పాల్గొని ఆసక్తికరమైన ప్రసంగాలను అందించారు.

రాయప్రోలు కుటుంబ సభ్యుల నుంచి డా.రాయప్రోలు భాను గంగాధర్, పన్నాల సత్యమూర్తి, డా.కానూరి మనోరమ, నరేష్ రావు, సుధీ కొత్తపల్లి, డా. రాయప్రోలు అపర్ణ, డా.రాయప్రోలు మహాలక్ష్మి, సుమ పన్నాల తదితరులు పాల్గొని రాయప్రోలు సుబ్బారావుతో వారికున్న అనుబంధాన్ని గురించి పంచుకున్నారు.

అదనపు ఆకర్షణగా ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ గరికిపాటి ప్రభాకర్ అమెరికా నుంచి రాయప్రోలు వారి దేశభక్తి గీతాలను పద్యాలను ఆలపించి అలరించగా లక్ష్మీ శ్రీనివాస్ వీణపై రాయప్రోలు వారి గీతాలను మ్రోగింపజేశారు.

కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ లింకు ద్వారా వీక్షించవచ్చవచ్చని నిర్వాహకులు తెలిపారు. https://youtu.be/rDdyGMeIWsA

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి
ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి
ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి

ట్రెండింగ్‌

Advertisement