ముంబై : ఒక బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్‌లో జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బుధవారం ఉదయం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ అమ్మాయి బస్టాండ్‌కు వచ్చింది.
ఈ విషయం తెలిసిన మరో అమ్మాయి అతడి కోసం బస్టాండ్‌కు చేరుకుంది. బస్టాండ్‌లో అమ్మాయిల మధ్య వాగ్వాదం ముదిరి వివాదానికి దారి తీసింది. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా ఇదే ఛాన్స్ అంటూ బాయ్‌ఫ్రెండ్ అక్కడి నుంచి జారుకున్నాడు. బస్టాండ్‌లో న్యూసెన్స్ చేస్తుండటంతో అమ్మాయిలిద్దరినీ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
బాయ్‌ఫ్రెండ్ కంటే లైఫ్‌లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఆపై విడుదల చేశారు. అమ్మాయిలు ఇద్దరికీ దాదాపు 17 ఏండ్ల వయసు ఉంటుందని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టామని అధికారులు తెలిపారు.