Giottus-ApeCoin | క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో ఆపెకాయిన్ (ఏపీఈ)ను లిస్టింగ్ చేస్తున్నట్లు గౌట్టస్ ప్రకటించింది. ఇది నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)గా ఉంటుందని తెలిపింది. భారత్‌లో తమ టోకెన్‌ను ఎక్స్చేంజ్ల్లో లిస్టింగ్ చేసిన క్రిప్టో ప్లాట్‌ఫామ్‌గా గౌట్టస్ నిలిచింది. ఏపీఈ టోకెన్ అంతర్జాతీయంగా పేరొందిన బినాన్స్, ఓకేఎక్స్ల్లో లిస్టవుతుంది. గౌట్టస్ యూజర్లు గురువారం నుంచి ఈఆర్సీ-20 బ్లాక్ చైన్ ద్వారా ఏపీఈ టోకెన్లు డిపాజిట్ చేస్తున్నారు. శుక్రవారం (మార్చి 18) నుంచి ఏపీఈ టోకెన్ ట్రేడింగ్, విత్‌డ్రాయల్స్ ప్రారంభం అయ్యాయి.
ఆపే కాయిన్ (ఏపీఈ) శుక్రవారం ఉదయం 9.50 గంటలకు ట్రేడింగ్‌లో 11.13 డాలర్లు పలికింది. ఈ కాయిన్ 120 మిలియన్లు సర్క్యులేషన్లో ఉంది. మొత్తం కోటి కాయిన్లు సరఫరా అయ్యాయి. బోర్డ్ యాపే యాచ్ క్లబ్ (బీఏవైసీ), మ్యూటంట్ ఆపే యాచ్ క్లబ్ (ఎంఏవైసీ) నియంత్రణలో ఏపీఈ లావాదేవీలు సాగుతాయి. ఎథీరియం బ్లాక్ చైన్ మీద ఎన్ఎఫ్టీ కలెక్షన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లుగా బీఏవైసీ, ఎంఏవైసీ నిలిచాయి.
గతేడాది ఏప్రిల్‌లో సేవలు ప్రారంభించినప్పటి నుంచి బీఏవైసీ.. ఎన్ఎఫ్టీ వరల్డ్‌లోనే అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచింది. సెరీనా విలియమ్స్, అడం డ్రాపర్, ఎమినిం, మార్క్ క్యూబన్ వంటి సెలబ్రిటీలు బీఏవైసీ ద్వారానే క్రిప్టో లావాదేవీలు జరుపుతారు. ఏపీఈ టోకెన్‌ను యుగ ల్యాబ్స్ సృష్టించింది. నూతన ఉత్పత్తుల తయారీలో, సేవల్లో యుగల్యాబ్స్ ముందుంటుంది.