హైదరాబాద్,జూన్ 24: కొంతమంది నెయ్యి లేకపోతే ముద్ద ముట్టరు. ప్రతి కూరలో నెయ్యి తప్పనిసరిగా వేసుకుంటారు. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు ఈ సమయంలో నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. మీరు నెయ్యిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ సమయంలో విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
బయట కొనే నెయ్యి కంటే ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడడం ఉత్తమం. బిడ్డ పెరుగుదలకు సరైన ఆహారం అవసరం. మంచి కొవ్వు ఉన్న పదార్ధాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. నెయ్యి మంచిదని మరీ ఎక్కువ తీసుకోకూడదు. అతిగా తీసుకుంటే ఏదైనా ప్రమాదకరమే. ప్రెగ్నెన్సీ మహిళలు రోజుకు రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి మాత్రమే తీసుకుంటే మంచిది. అంతేకాదు మీరు మీ డాక్టర్ సలహా తీసుకుని వాడడం అన్నింటి కంటే ఉత్తమం.
అప్పుడే పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. లోపల పెరిగే బిడ్డకు అన్ని అవయవాలు సరిగ్గా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు సుఖ ప్రసవం అయ్యేలా చేస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.