ధర: రూ.20 లక్షలు (అంచనా)
బెర్లిన్, జూలై 26: పెట్రోల్ అయిపోతుందన్న రంది లేదు.. చార్జింగ్ తగ్గిపోతుందన్న బాధ లేదు.. సూర్యుడు ఉంటే చాలు. సౌరశక్తితో చార్జింగ్ చేసుకొని రయ్‌మని దూసుకెళ్లే కారును జర్మనీకి చెందిన సోనో మోటర్స్ అభివృద్ధి చేసింది. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం సోలార్‌తో 112 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దానికోసం కారుపై 456 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. సియాన్ పేరుతో 2023లో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతున్నది. ఈ కారు కోసం ఇప్పటికే 19 వేల మంది బుక్ చేసుకొన్నారు.
సోలార్ కారు విశేషాలు
కారుపై సోలార్ ప్యానెల్స్: 456
ఒకసారి బ్యాటరీచార్జింగ్తో: 300 కిలోమీటర్ల ప్రయాణం
సోలార్‌తో: 112 కిలోమీటర్ల ప్రయాణం (వారానికి)
మార్కెట్లోకి: 2023 (అంచనా)
ఉత్పత్తి లక్ష్యం: ఏడేండ్లలో 2.5 లక్షల యూనిట్లు