బెర్లిన్, మార్చి 15: ఆక్స్ఫర్డ్ టీకాపై ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. తొలుత డెన్మార్క్ గతవారం ఈ టీకాపై నిషేధం విధించింది. అనంతరం ఐర్లాండ్, థాయ్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, ఐస్లాండ్, కాంగో, బల్గేరియా తదితర దేశాలు కూడా వ్యాక్సిన్ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించాయి.కాగా, తమ టీకా సురక్షితమైనదేనని ఆస్ట్రాజెనెకా తెలిపింది. వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి తమ టీకా తీసుకోవడమే కారణమని ఇంతవరకూ ఒక్క ఆధారం లేదని పేర్కొంది.