e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News అంద‌రూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్న‌ర‌న్న‌..జాతిర‌త్నాలు ట్రైల‌ర్

అంద‌రూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్న‌ర‌న్న‌..జాతిర‌త్నాలు ట్రైల‌ర్

అంద‌రూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్న‌ర‌న్న‌..జాతిర‌త్నాలు ట్రైల‌ర్

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో న‌టిస్తున్న సినిమా జాతిరత్నాలు. అనుదీప్‌ కె.వి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ ట్రైల‌ర్ ను స్టార్ హీరో ప్ర‌భాస్ లాంఛ్ చేశాడు. టెన్త్‌లో 60 ప‌ర్సెంట్‌, ఇంట‌ర్ లో 50 ప‌ర్సెంట్‌, బీటెక్‌లో 40 శాతం ఏంది రా అనే డైలాగ్స్ తో ట్రైల‌ర్ షురూ అవ‌గా..అంద‌రూ మ‌రీ గ‌లీజుగా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తున్న‌ర‌న్నా న‌వీన్ అంటున్నాడు.

ఫరియాను అబ‌ద్దాలు చెప్పి ఎలా ప్రేమ‌లో ప‌డేశాడు..ముగ్గురు క్రిమిన‌ల్స్ (న‌వీన్, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ) ‌చంచ‌ల్ గూడ జైలుకు ఎందుకెళ్లారు.. ఆ త‌ర్వాత వారికి జైల్లో వెన్నెల కిశోర్ ప‌రిచ‌యం కావ‌డం…చాలా రోజుల త‌ర్వాత బ్ర‌హ్మానందం క‌నిపించ‌డంతో..ఫ‌న్నీగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. జాతిర‌త్నాలు సినిమా అంద‌రికీ వినోదాన్ని పంచ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు.ఇప్ప‌టికే టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌గా.. జైలులో ఖైదీలుగా నవీన్‌, రాహుల్‌, ప్రియదర్శి కనిపిస్తూ..వారి మధ్య వచ్చే సంభాషణలు ఎంట‌ర్ టైనింగ్‌గా సాగుతున్నాయి.

Advertisement
అంద‌రూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్న‌ర‌న్న‌..జాతిర‌త్నాలు ట్రైల‌ర్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement