ఆకాశంలో అందాల జాబిల్లి.. అంతటి అందమైన జాబిల్లిని చూస్తే మనసు హాయిగా ఉంటుంది. అంతే కాదు ఆ పున్నమి చంద్రుడిని చూసిన ప్రతి ఒక్కరి మనసు పులకించిపోతోంది. అలాంటి అందమైన జాబిల్లి.. భాగ్యనగర వాసులను ఇటీవల ఓ రాత్రి కనువిందు చేసింది. నల్లగొండ క్రాస్‌రోడ్స్ వద్ద మెట్రో పట్టాలపై మీదుగా నిండు చందమామ వెల్లివిరిసింది. ఆ అద్భుతమైన అందాల చందమామను చూపరులను కట్టిపడేసింది. ఇంకేముంది.. ఆ అందమైన జాబిల్లిని నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.