జో శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నర్మద’.జెమిని సౌమిక సంహిత్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా ఎమ్ఆర్ చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…‘ఊరిలో జరిగే అన్యాయాలను ఎదిరించే సాహసమున్న యువతి నర్మద. ఊరి బాగు కోసం చేసే పోరాటంలో ఆమెకు పరిస్థితులు అనేది ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం.’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ముప్పలనేని శివ, నటుడు కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.