న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ కంపెనీ వెబ్‌సైట్‌పై ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఇక బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్లో ఆఫర్ చేసిన డీల్స్ అన్నింటినీ ఈకామర్స్ సైట్ కొనసాగిస్తోంది. దసరా సేల్‌లో ఐఫోన్లు, 5జీ అండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, వైర్లెస్ ఇయర్ఫోన్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై పది శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పలు ప్రోడక్ట్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లూ లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 13ను రూ 69,900 నుంచి డిస్కౌంట్ ధరతో రూ 59,990కు విక్రయిస్తోంది. ఈ డివైజ్‌పై కంపెనీ రూ 9,910 డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ 1250 అదనపు డిస్కౌంట్ ఆఫర్లో ఉంది. దీంతో డివైజ్ ధర రూ 58,740కి తగ్గుతుంది. ఇక రియల్‌మి 9 ప్రొ 5జీ, రియల్‌మి 91 స్మార్ట్ఫోన్లు వరుసగా రూ 15,559, రూ 13,949కి అందుబాటులో ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 1ను ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌లో భాగంగా రూ 29,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులు, ఇతర ఆఫర్లు ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకు నథింగ్ ఫోన్ 1ను సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ విక్టస్ ల్యాప్‌టాప్ కోర్ ఐ5 మోడల్ రూ 65,990కి లభిస్తుండగా ఆఫర్ల అనంతరం మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.