e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఇక్క‌డ‌ బంగారం లోన్ల‌పై వ‌డ్డీ చౌక‌.. ఎంతంటే?!

ఇక్క‌డ‌ బంగారం లోన్ల‌పై వ‌డ్డీ చౌక‌.. ఎంతంటే?!

ఇక్క‌డ‌ బంగారం లోన్ల‌పై వ‌డ్డీ చౌక‌.. ఎంతంటే?!

న్యూఢిల్లీ: అనారోగ్యంతో హాస్పిట‌లైజేష‌న్‌కు గురైన‌ప్పుడు, ఇత‌ర అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌బ్బు స‌మ‌స్యను ఎదుర్కొంటున్న వారికి ఉత్త‌మ ప‌రిష్కార మార్గం బంగారం రుణాలు. బంగారం తాక‌ట్టు పెట్టి రుణాలు తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోర్ గానీ, ఆదాయ ఫ్రూప్ గానీ అవ‌స‌రం లేదు. 18 ఏండ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ బంగారంపై రుణాలు తీసుకోవ‌చ్చు.. బ్యాంకుల‌తోపాటు బ్యాంకేత‌ర ఆర్థిక సంస్థ‌లు (ఎన్బీఎఫ్‌సీ) కూడా బంగారంపై రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఐదు బ్యాంకులు చౌక వ‌డ్డీరేటుపై బ్యాంకు రుణాలిస్తున్నాయి.

త‌క్ష‌ణ న‌గ‌దు అవ‌స‌రాల కోసం స‌మ‌స్య‌ల్లేకుండా చౌక‌‌గా ల‌భించే రుణం బంగారం రుణం. బంగారం తాక‌ట్టు పెట్టుకుని బ్యాంక‌ర్లు, ఆర్థిక సంస్థ‌లు రుణాలిస్తాయి. సాధార‌ణంగా బ్యాంక‌ర్లు బంగారంపై రుణాలు మంజూరు చేయ‌డానికి అధిక క్రెడిట్ స్కోర్ అవ‌స‌రం లేదు. బంగారం రుణం పంపిణీ చేయ‌డానికి చాలా త‌క్కువ టైం మాత్ర‌మే ప‌డుతుంది. బంగారంపై రుణాల మంజూరుకు విధి విధానాలేమిటో చూద్దాం..

సాధార‌ణంగా బంగారం తాక‌ట్టుపై రుణాలు రెండేండ్ల వాయిదా వ‌ర‌కు ఇస్తారు. ఆ గ‌డువు పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్లీ రుణాన్ని పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు.
బంగారం రుణం తీసుకునే వారు త‌మ వ‌ద్ద ఉన్న ఆభ‌ర‌ణాలు, బంగారం బార్‌, నాణాలు తాక‌ట్టు పెడితే, దాని విలువ‌లో 80 శాతం రుణం ఇస్తాయి. అధిక రుణం తీసుకుంటే వ‌డ్డీ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

బంగారం రుణ వాయిదాలు గ్ర‌హీత‌ల‌కు త‌మ‌కు అనువైన విధంగా రూపొందించుకోవ‌చ్చు. బుల్లెట్ పేమెంట్ లేదా ఈఎంఐ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.
బంగారంపై రుణాలు తీసుకోవ‌డానికి మంచి క్రెడిట్ హిస్ట‌రీ అవ‌స‌రం లేదు. కానీ మంచి క్రెడిట్ హిస్ట‌రీ ఉంటే, త‌క్కువ వ‌డ్డీరేటుపైనే ప‌సిడిపై రుణాలు తీసుకోవ‌చ్చు.

ప‌సిడిపై రుణాలు తీసుకోవ‌డానికి ఎక్కువ ప‌త్రాలు అవ‌స‌రం లేదు. రుణ గ్ర‌హీత త‌మ గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
బంగారంపై తీసుకునే రుణం చాలా భ‌ద్ర‌మైంది. వ్య‌క్తిగ‌త రుణంపైక‌న్నా త‌క్కువ వ‌డ్డీరేటు వ‌ర్తిస్తుంది. ప‌ర్స‌న‌ల్ లోన్లు అన్ సెక్యూర్డ్ అనే విమర్శ‌లు ఉన్నాయి.

ఇప్ప‌టికైతే రుణ గ్ర‌హీత‌ల జాబ్ ప్రొఫైల్‌, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మంజూరైనా.. ప‌ర్స‌న‌ల్ లోన్ల‌పై వ‌డ్డీరేట్లు 10-15 శాతం ఉంటున్నాయి. కానీ బంగారంపై ఇచ్చే రుణాల‌కు బ్యాంకులు ఏడు శాతం వ‌డ్డీ నుంచి వ‌సూలు చేస్తున్నాయి.

ఐదు బ్యాంకులు త‌క్కువ‌గా వ‌సూలు చేసే వ‌డ్డీరేట్ల‌ను ప‌రిశీలిద్దాం..
బ్యాంక్ పేరు- వ‌డ్డీరేటు
పంజాబ్ సింధ్ బ్యాంక్‌- 7%
బ్యాంక్ ఆఫ్ ఇండియా‌- 7.35%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.5%
కెన‌రాబ్యాంక్‌-7.65%
యూనియ‌న్ బ్యాంక్‌- 8.2%

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇక్క‌డ‌ బంగారం లోన్ల‌పై వ‌డ్డీ చౌక‌.. ఎంతంటే?!

ట్రెండింగ్‌

Advertisement