మీనాల శృంగార సయ్యాటను ఎంతో హృద్యంగా కెమెరాతో బంధించిన ఫ్రాన్స్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్ ల్యూరెంట్ బాలెస్టాకు ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. 95 దేశాల నుంచి వచ్చిన 50 వేలకు పైగా ఫొటోలను పరిశీలించిన కమిటీ సభ్యులు చివరకు ఈ చిత్రాన్ని ఎంపికచేశారు. ‘కమోఫ్లాగే గ్రూపర్స్’ అనే జాతి చేపలు సంభోగంలో పాల్గొనే క్రమంలో నీటిలో విడుదలైన అండాలు, శుక్రకణాల తెల్లని మేఘాన్ని చిత్రంలో చూడొచ్చు.