e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News రేపు విడుద‌ల కానున్న‌2 డీజీ ఫ‌స్ట్ బ్యాచ్

రేపు విడుద‌ల కానున్న‌2 డీజీ ఫ‌స్ట్ బ్యాచ్

రేపు విడుద‌ల కానున్న‌2 డీజీ ఫ‌స్ట్ బ్యాచ్

న్యూఢిల్లీ : యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫ‌స్ట్‌ బ్యాచ్ రేపు విడుదల కానున్న‌ది. క‌రోనాపై పోరులో కీల‌కాస్త్రం కానున్న ఈ ఔష‌ధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ సహకారంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. కొవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఈ ఔషధం మొదటి బ్యాచ్ రేపు అందుబాటులోకి రానున్న‌ది. ఫ‌స్ట్ బ్యాచ్‌ను కేంద్ర‌ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష‌వర్ధన్ విడుదల చేయనున్నారు. దేశ రాజ‌ధానిలోని వివిధ ద‌వాఖాన‌ల్లో 10,000 సాచెట్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు.

డీఆర్డీవో త‌యారు చేసిన 2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధం అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ‌త వారం అనుమ‌తి ఇచ్చింది. ఈ ఔష‌ధం కొద్దిగా నుంచి ఓ మోస్త‌రు క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై బాగా ప‌ని చేసింది. ఒక‌వైపు చికిత్స అందిస్తూనే అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇవ్వ‌డం వ‌ల్ల క‌రోనా రోగులు వేగంగా కోలుకునే అవ‌కాశాలున్నాయ‌ని డీఆర్‌డీఓ వెల్ల‌డించింది. అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలినిచ్చింద‌ని, ఆక్సిజన్‌పై ఆధార‌ప‌డ‌టాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్‌డీఓ తెలిపింది. ఈ డ్ర‌గ్ పొడి రూపంలో సాచెట్ల‌లో ల‌భిస్తుంది. ఈ పొడిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగ‌డం వ‌ల‌న వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్డీవో తెలిపింది.

ఈ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్‌డీఓ 2020 ఏప్రిల్‌లో సన్నాహాలు మొద‌లుపెట్టింది. ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఈ అణువు సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌తో క‌లిసి డీఆర్‌డీఓ ల్యాబ్ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ అలైడ్‌ సైన్సెస్ ఈ ఔష‌ధాన్ని అభివృద్ధి చేసింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

అమెరికా ఉద్యోగం క‌న్నా పాడిలో నాలుగింత‌లు ఎక్కువ సంపాద‌న : కిషోర్ మంత్రం

గంగా న‌ది ఇసుక‌లో స‌మాధులు.. వెలికితీసిన వ‌రుణుడు

సీఎం ఖ‌ట్ట‌ర్‌కు రైతుల నిర‌స‌న‌.. హిసార్‌లో ప‌రిస్థితి ఉద్రిక్తం

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం

టీకా ఉత్ప‌త్తులు వేగ‌వంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ‌

యుద్ధం వ‌స్తే అమెరికాదే ఓట‌మి: గ్లోబ‌ల్ టైమ్స్ సంపాద‌కీయం

టెస్ట్ ఆడ‌ట్లేద‌ని నేన‌న‌లేదు : భువ‌నేశ్వ‌ర్ కుమార్

13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేపు విడుద‌ల కానున్న‌2 డీజీ ఫ‌స్ట్ బ్యాచ్

ట్రెండింగ్‌

Advertisement