కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరానికి సమీపంలోని హౌరాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హౌరాలోని ఓ కమర్షియల్ బిల్డింగ్లోగల బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు పరిసర దుకాణాలకు వ్యాపించాయి. ఘటన జరిగిన వెంటనే స్థానిక వ్యాపారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు, ఫైర్‌ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. కోల్‌కతా నగర సమీపంలోని హౌరా మైదాన్ ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.