న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా శుక్రవారం విడుదలైంది. ఐక్యరాజ్యసమితికి అనుసంధానంగా ఉన్న సంస్థ ప్రతి ఏటా ఈ రిపోర్ట్‌ను అందిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ లిస్ట్‌లో యురోపియన్ దేశమైన ఫిన్లాండ్ టాప్‌లో ఉండటం విశేషం. ఫిన్లాండే కాదు.. టాప్ టెన్‌లో మెజార్టీ దేశాలు యూరప్‌కు చెందినవే కావడం విశేషం. డెన్మార్క్ రెండోస్థానంలో, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో ఒక్క న్యూజిలాండ్ (9) మాత్రమే యురోపియనేతర దేశం. యునైటెడ్ కింగ్డమ్ 13 నుంచి 17వ స్థానానికి, అమెరికా 19వ స్థానానికి పడిపోయాయి. జర్మనీ 17 నుంచి 13వ స్థానానికి వెళ్లగా, ఫ్రాన్స్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని 21వ స్థానంలో ఉంది.
ఎలా చూస్తారు?
ఈ సర్వే 149 దేశాల్లో నిర్వహించారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ విడుదల చేయడం ఇది 9వసారి. ఆ దేశ జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేస్తారు. గత మూడేళ్లలో వీటిలో సదరు దేశం పనితీరు సగటును చూసి ర్యాంకులు కేటాయిస్తారు. ఈ లిస్ట్‌లో ఆప్ఘనిస్థాన్ చివరి స్థానంలో నిలవగా.. ఆఫ్రికా దేశాలైన లెసోతో, బోట్స్వానా, రువాండా, జింబాబ్వే ఆపైన ఉన్నాయి. గతేడాది కరోనా ఉన్నా కూడా దేశాల జాబితాలో పెద్దగా మార్పులేమీ లేవు.