By Maduri Mattaiah
సందీప్ రెడ్డి వంగా..అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు. సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన వారిలో మహేశ్‌బాబు మొదటి స్థానంలో ఉంటాడు. సందీప్‌రెడ్డి స్క్రిప్ట్, డైరెక్షన్‌కు ఫిదా అయిపోయాడు మహేశ్. అర్జున్‌రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో మహేశ్‌బాబు సినిమా చేసేందుకు గతంలో వార్తలు కూడా వచ్చాయి. మహేశ్‌కు ఎనిమల్ సహా మరో స్క్రిప్ట్‌ను కూడా వినిపించగా..తన ఇమేజ్‌కు ఆ స్టోరీ సరిగ్గా షూట్ అవ్వదని భావించి వెనక్కి తగ్గినట్టు డిస్కషన్స్ కూడా జరిగాయి.
కానీ ఫైనల్‌గా వీరిద్దరి కాంబినేషన్ కు ముహూర్తం ఖరారవుతున్నట్టు ఓ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇద్దరి కాంబోలో వచ్చేది సినిమా కాదట. ఓ పాపులర్ బ్రాండ్ కోసం యాడ్ ఫిల్మ్ షూట్ చేయనున్నాడట మహేశ్. ఈ యాడ్ ఫిల్మ్‌ను సందీప్‌రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్. యాడ్ ఫిల్మ్‌కు డైరెక్టర్ గా సందీప్‌రెడ్డి పేరును మహేశ్‌బాబే సూచించాడని ఇన్సైడ్ టాక్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.