తిరుమలాయపాలెం, నవంబర్ 9: తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల్లో ఉన్న ధాన్యం రాసుల వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ.. అధికంగా వడ్లు పండించే బచ్చోడులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతోపాటు బీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు జక్కుల యాదగిరి, తిమ్మిడి హనుమంతరావు, గొర్రెపాటి రమేష్, అనంతాచారి, ఎన్నబోయిన శ్రీనివాసరావు, గొర్రెపాటి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.