ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో చాలా మందే ఉంటారు. మొదటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని వరుస ఆఫర్లు దక్కించుకున్న నటీమణులకు ఇండస్ట్రీలో కొదవేమి లేదు. తాజాగా ఈ లిస్టులో అందాల భామ ఫరియా అబ్దుల్లా చేరిపోయింది. నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు చిత్రంతో సిల్వర్‌స్క్రీన్ పై సందడి చేసింది ఫరియా. తన చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచేసిన ఈ భామ ఖాతాలో పెద్ద ఆఫరే వచ్చి పడినట్టు ఫిలింనగర్లో వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఫరియాఅబ్దుల్లాకు రవితేజ నటించబోయే కొత్త సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందట. అయితే ఈ హైదరాబాదీ భామ రవితేజతో రొమాన్స్ చేయబోయే విషయంపై అధికారికంగా ప్రకటన వస్తే..క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు ఇటీవల కాలంలో వైరల్ అవుతున్న సాంగ్స్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త భామలను ఎంపిక చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. చిట్టి నా బుల్బుల్ చిట్టి పాట సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో ఫరియా అబ్దుల్లాను చూసిన మేకర్స్ వెంటనే ఒకే చేసినట్టు ఇన్సైడ్ టాక్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.