F.I.R movie on OTT | తమిళంలో వచ్చిన రాట్ససన్ సినిమాతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న నటుడు విష్ణువిశాల్. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ఐఆర్’. ఫిబ్రవరి 11న తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. పోటిగా ఖిలాడి, డిజే టిల్లు సినిమాలు ఉండటంతో ఈ చిత్ర కలెక్షన్లకు దెబ్బపడింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటిల్ రీలిజ్ ప్రకటన వచ్చింది. థియేటర్లో విడుదలైన నెల రోజులకు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎఫ్ఐఆర్ చిత్రం మార్చి 11 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విష్ణువిశాల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగులో మాస్రాజ రవితేజ సమర్పణలో అభిషేక్ నామా విడుదల చేశాడు.